మల్కాజిగిరి, మార్చి 17 : బొల్లారం లోని హిందూ శ్మశాన వాటికను చెత్త డంపింగ్ యార్డ్ గా రాంకీ , జీహెచ్ఎంసీ మార్చడాన్ని నిరసిస్తూ.. రెండో రోజు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి చెత్తలో కూర్చొని నిరసన తెలిపారు. స్టాప్ ఇల్లీగల్ డంపింగ్ ఇన్ హిందూ గ్రేవ్ యార్డ్ అనే నినాదంతో దాదాపు 40 కాలనీల ప్రజలతో కలిసి ధర్నా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు ప్రతి రోజూ ధర్నా నిర్వహిస్తామన్నారు. నిరసనలో శాంతి శ్రీనివాస్‌రెడ్డి , రమేశ్, పరమేశ్, అనిల్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.