మల్కాజిగిరి, ఏప్రిల్ 7: నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మంగళవారం మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ వినయ్‌కృష్ణారెడ్డిని మంగళవారం కలిశారు. వివిధ సమస్యలను వివరించి, వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌ను కలిశారు. సమస్యలను పరిష్కరించేవిధంగా చూడాలని కోరుతూ హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్‌ను కలిసి, చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నిరుగొండ జగదీశ్ గౌడ్, చింతల శాంతిశ్రీనివాస్‌రెడ్డి, ఏకే.మురుగేష్, నేతలు.. రాముయాదవ్, ప్రభాకర్, శ్రీనివాస్, శివ, సాయి, సుమన్, రవీందర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.