జూబ్లీహిల్స్,అక్టోబర్27: పేదల పక్షపాతి ముఖ్య మంత్రి కేసీఆర్ అని, అందుకే వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. బుధవారం కార్పొరేట ర్ రాజ్‌కుమార్ పటేల్ అధ్యక్షతన యూసుఫ్‌గూడ మహమద్ ఫంక్షన్ హాల్లో వరంగల్ విజయగర్జన మహాసభ సన్నాహక సమావేశంలో భాగంగా జూబ్లీహిల్స్ కార్యకర్త ల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దళిత బంధు ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకం కాదని, అది పేదల కోసం అమలువుతున్న పథకం అని అన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయం అంటే దండుగ అనే పరిస్థితికి తీసుకొస్తే సీఎం కేసీఆర్ వ్యవసాయ అంటే పండగలా మార్చారని అన్నారు. వరంగల్ విజయగర్జన బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి 100 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అన్నింట్లో ప్రత్యేకతను చాటుకునే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తలు విజయగర్జనకు క్రమశిక్షణతో తరలిరావాలని,మహిళల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్, కార్పొరేటర్లు దేదీప్య విజయ్, వనం సంగీతా యాదవ్, నాయకులు డి.సంజీవ, అప్పూఖాన్, మన్సూర్,అజయ్, పల్లవియాదవ్, కృష్ణమోహన్, ప్రదీప్, సంతోష్, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.