e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home హైదరాబాద్‌ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

బంజారాహిల్స్‌,సెప్టెంబర్‌ 28: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 19 డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌, జీహెచ్‌ఎంసీ ఈఈ రాజ్‌కుమార్‌, కార్పొరేటర్లు, సీఎన్‌ రెడ్డి, దేదీప్యరావు, రాజ్‌కుమార్‌ పటేల్‌తో పాటు అన్ని డివిజన్లకు చెందిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొని అభివృద్ధి పనులపై చర్చించారు. వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే మాగంటికి కార్పొరేటర్‌ దేదీప్యరావు అందజేశారు.

వెంగళరావునగర్‌లో రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, యూసుఫ్‌గూడ డివిజన్‌ పరిధిలోని కృష్ణానగర్‌ బీ బ్లాక్‌లో రోడ్డు పనులు చేపట్టాలని కార్పొరేటర్‌ రాజ్‌కుమార్‌ పటేల్‌ కోరారు. వెంకటగిరి నుంచి కృష్ణానగర్‌ దాకా వరదనీటి సమస్యను పరిష్కరించేందుకు రూ. 1.95కోట్లు మంజూరయ్యాయని, 2 మీటర్ల వెడల్పుతో బాక్స్‌టైప్‌ నాలాను నిర్మించేందుకు టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని, వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రహమత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో అభివృద్ధి పనుల కోసం రూ.7కోట్ల మేర అవసరమవుతుందని ఈ మేరకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని కార్పొరేటర్‌ సీఎన్‌రెడ్డి చెప్పారు.

- Advertisement -

డివిజన్‌ పరిధిలోని క్వారీ ల్యాండ్స్‌లో చేపట్టనున్న ప్లేగ్రౌండ్‌ నిర్మాణం పూర్తయితే ఎంతో మంది యువ క్రీడాకారులకు ఉపయోగంగా ఉంటుందని, దీనికోసం తన ఎమ్మెల్యే కోటా నుంచి నిధులు ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారం కోసం రూ.2కోట్లు కేటాయించడం జరిగిందని, ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలతో మాట్లాడి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ నుంచి రహ్మత్‌నగర్‌ చౌరస్తా దాకా 100 ఫీట్ల రోడ్డు విస్తరణపనులు, స్టేట్‌ హోమ్‌ వెనుక భాగంలో లింక్‌ రోడ్డు నిర్మాణం, ఎర్రగడ్డ డివిజన్‌ నట్‌రాజ్‌నగర్‌ రోడ్డు విస్తరణ, మీటర్‌ ఫ్యాక్టరీ రోడ్డు విస్తరణ పనులు త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో డివిజన్ల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కోనేరు అజయ్‌కుమార్‌, దుర్గం ప్రదీప్‌, సంజీవ, కృష్ణమోహన్‌,అప్పు ఖాన్‌, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కు అందజేత

బంజారాహిల్స్‌,సెప్టెంబర్‌ 28: అనారోగ్యంతో బాధపడుతున్న రహ్మత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో నివాసం ఉంటున్న మీరాబాయ్‌ అనే వృద్ధురాలి చికిత్స కోసం సీఎం రిలీఫ్‌ఫండ్‌ కింద మంజూరైన రూ.20వేల చెక్కును మంగళవారం జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అందజేశారు. కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు మన్సూర్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement