బంజారాహిల్స్, జూలై 22: తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్త నిల్వలను పెంచేందు కు భారీ స్థాయిలో రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం శనివారం కావడంతో యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున రక్త దాన శిబిరానికి ఏర్పా టు చేస్తున్నట్టు ఎమ్మెల్యే మాగంటి తెలిపారు. రక్తదాన శిబిరంలో రికార్డు స్థాయిలో రక్తదానం చేసి రక్త నిల్వలు పెంచేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన కార్మికులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబి రం ఏర్పాట్లపై కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, దేదీప్యారావు, రాజ్ కుమార్ పటేల్‌తో పాటు అన్ని డివిజన్లకు చెందిన ము ఖ్య నేతలతో గురువారం సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మా గంటి గోపీనాథ్ వారికి తగు సూచనలు ఇచ్చారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రక్తదాన శిబిరం ప్రారంభమవుతుందని, స్టేడియంలోని నాలుగు గేట్ల నుంచి డివిజన్ల వారీగా రక్తదాతలు వచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రక్తదానం చేసే వారి కోసం సుమారు 150 పడకలు ఏర్పాటు చేశామని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గతేడాది సుమారు 2200 మంది మం త్రి కేటీఆర్ జన్మదినం రోజున రక్తదానం చేయ డం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించామని, ఈసారి ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉందన్నారు.