కేపీహెచ్బీ కాలనీ: ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. గురువారం కూకట్పల్లిలో శేరిలింగంపల్లి కూకట్పల్లి నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు,ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం పై ప్రజలకు అవగాహన కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను ఏకం చేయాలన్నారు.