కూకట్పల్లి, నవంబర్3: కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా కృషి చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలో రూ.67.80 లక్షల వ్యయంతో దేవినగర్, మైత్రినగర్, విజ్ఞాన్పురి కాలనీ, సాయి నగర్లలో సీసీరోడ్ల నిర్మాణానికి కార్పొరేటర్ సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతిడివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నమని అన్నారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కూకట్పల్లి ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు, మహేశ్ రాజు, నాగరాజు, వెంకటేశ్, యాదగిరి, రాజ్ కుమార్, రాంచందర్, ప్రభాకర్ గౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.