కేపీహెచ్‌బీ కాలనీ/మూసాపేట/బాలానగర్/మియాపూర్, ఆగస్టు 23 : కరోనా రహిత సమాజమే లక్ష్యంగా ఇంటింటికీ కరోనా టీకా కార్యక్రమాన్ని చేపట్టినట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. సోమవారం కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 22 ప్రాంతాల్లో మొబైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. మూసాపేట, కూకట్పల్లి సర్కిళ్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ కరోనా టీకా సర్వేను పరిశీలించడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు వందశాతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు.
ఇప్పటికే కాలనీలు, బస్తీల్లో ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు కరోనా టీకా వేయించుకోని వారికి ఇంటికి వెళ్లి టీకా వేయడం జరుగుతుందన్నారు. దీనికోసం సర్కిళ్లు, వార్డుల వారీగా నోడల్ ఆఫీసర్లు, ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకుని కరోనా రహిత సమాజ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, ఏఎంహెచ్‌వో సంపత్‌కుమార్, ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
కరోనా వ్యాక్సినేషన్‌పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు అన్నారు. సోమవారం కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఇన్కారు వన్సిటీలో చేపట్టిన ఇంటింటికీ కరోనా టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సంధ్యారాణి, ఏఎంసీ రమేశ్, శానిటేషన్ సూపర్వైజర్ మురళీధర్‌రెడ్డి, స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నర్సింహారావు, కృష్ణమోహన్, పట్టాభి, శ్రీనివాస్‌రెడ్డి, రవిశంకర్ తదితరులు ఉన్నారు.
కొవిడ్ టీకా పంపిణీ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం మూసాపేట డివిజన్ వార్డు కార్యలయంలో వైద్యరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటింటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్, డివిజన్ టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్, స్థానిక బీజేపీ కార్పొరేటర్ కోడిచర్ల మహేందర్‌తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ సంపత్, ఏఈ శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాబురావు, జిల్లా గోపాల్, హరినాథ్, తుకారాం, కర్క రవీందర్, సప్పిడి శ్రీనివాస్, సత్యనారయణగౌడ్, జెల్ల రాము, తదితరులు పాల్గొన్నారు.
ఫతేనగర్ డివిజన్లో ఇంటింటికీ కొవిడ్ టీకా అందించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని జింకలవాడ బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను జడ్సీ మమత, డీసీ రవికుమార్‌తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో సుదర్శన్‌రెడ్డి, సురేందర్నాయుడు పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేజ్-2 కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూకట్పల్లి డీసీ రవీందర్‌కుమార్, కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, సమ్మారెడ్డి, సత్యనారాయణ, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని హైదర్‌నగర్ బస్తీ దవాఖానలో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్మయి, రఘు, ముస్తాఫా, పార్టీ నేతలు పాల్గొన్నారు.