కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 31 : బోనాలను వైభవంగా జరుపుకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నియోజకవర్గంలోని 156 దేవాలయాలకు.. బోనాల వేడుకల కోసం ప్రభుత్వం తరపున రూ. 45లక్షల చెక్కులను ఆల య కమిటీ చైర్మన్లకు పంపిణీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సర్వమతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ.. అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు పేదలందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారన్నారు.
బోనాల వేడుకల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ చైర్మన్లకు సూచించారు. అదే విధంగా జీహెచ్ఎంసీ సిబ్బంది ఉత్సవాలు జరిగే ప్రధాన ఆలయాల వద్ద మట్టి గ్రావెల్‌తో చదును చేసిందని తెలిపారు. ఆలయాలకు వెళ్లే దారులను బాగుచేయడంతో పాటు విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటి స్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. నియోజకవర్గం ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు.
బాలానగర్, జూలై 31 : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల జాతర రావడంతో అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. మూసాపేట సర్కిల్ పరిధి ఫతేనగర్ డివిజన్, కూకట్పల్లి సర్కిల్ పరిధి ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లోని కాలనీలు, బస్తీల్లోని అమ్మవారి ఆలయాలు పండుగకు రూపుదిద్దుకుంటున్నాయి. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా తగిన ఏర్పా ట్లు చేస్తున్నారు. ఆలయాల వద్ద బారికేడ్లు, భక్తులకు తాగునీటి సౌకర్యం వంటి ఏర్పాట్లు చేయడంలో ఆలయ కమిటీ నేతలు నిమగ్నమయ్యారు.
కూకట్పల్లి, జూలై 31 : ఆషాఢ మాసం చివరి ఆదివారం జరిగే బోనాల పండుగకు ఆలయాలు అందంగా ముస్తాబు అయ్యాయి. కూకట్పల్లి, బాలానగర్ డివిజన్ల పరిధిలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలని ఆలయ కమిటీలు నిర్ణయించాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే అమ్మవారి బోనాలను భౌతిక దూరాన్ని పాటిస్తూ జరుపుకోవాలని సీఐ తెలిపారు. స్టేషన్ పరిధిలో మొత్తం 16 ఫలహార బండ్ల ఊరేగింపునకు అనుమతులను ఇచ్చామన్నారు. 88మంది సిబ్బంది బోనాల బందోబస్తులో పాల్గొంటున్నారని ఎలాంటి డీజేలకు అనుమతి లేదని, వారికి కేటాయించిన రూట్లలోనే వెళ్లాలని సూచించారు.