పట్టణ ప్రగతి నగరంలో పండుగ వాతావరణంలా ప్రారంభమైంది. పదిరోజుల పాటు కొనసాగనున్న ప్రగతిని స్థానిక నాయకులు లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు మొక్కలు నాటడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాల తొలగింపును చేపట్టారు.
కేపీహెచ్‌బీ కాలనీ/మియాపూర్/ కూకట్పల్లి/బాలా నగర్/మూసాపేట , జూలై 1 : భావితరాలు మనుగడ సాగించాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం పట్టణ ప్రగతి ప్రారంభోత్సవంలో భాగంగా బాలాజీనగర్ డివిజన్లోని కేపీహెచ్‌బీ కాలనీ 15వ ఫేజ్ జంగిల్ పార్కు వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని డీసీ రవికుమార్, కార్పొరేటర్లు శిరీషాబాబూరావు, ఆవుల రవీందర్‌రెడ్డి, పండాల సతీశ్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించుకోవాలని సూచించారు. పరిసరాల శుభ్రతే లక్ష్యం గా చేపట్టిన పట్టణ ప్రగతిలో బస్తీలు, కాలనీలలో చెత్తాచెదారాన్ని తొలగించాలని అధికారులకు సూచించారు. ముళ్లకత్వ చెరువులోని బతుకమ్మ కోనేటిలో గంబూషియా చేపలను నీటిలో వదిలారు. చెరువులు, కుంటలలో గుర్రపుడెక్కను యుద్ధప్రాతిపదికన తొలగించాలని.. లార్వా దశలోనే దోమలను నియంత్రించేందుకు రసాయనాలను పిచికారి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్ పగడాల బాబూరావు, సీనియర్ ఎంటమాలజిస్ట్ లచ్చిరెడ్డి ఉన్నారు
పట్టణ ప్రగతిలో భాగంగా బాలానగర్ డివిజన్ నర్సాపూర్ చౌరస్తా వద్ద కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలసి కూకట్పల్లి శాసన సభ్యులు మాధవరం కృష్ణారావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో జీహెచ్ంఎసీ ఏఈ రషీద్, డివిజన్ అధ్యక్షుడు మందడి సుధాకర్ రెడ్డి, కృష్ణమూర్తి, అంబటి సునీల్ కుమార్ గుప్తా, ఎలిజాల యాదగిరి, ఆనంద్‌రెడ్డి, శ్రీనివాస రాజు, మహమ్మద్ ఖాజ, దారం సతీశ్, మహమ్మద్ బాబా, సింగజోగి రామేశ్వర్, కందుల రమేశ్, మురళీధర్ ముదిరాజ్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ దత్తత డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని హైదర్నగ ర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. పట్టణ ప్రగతి ప్రారంభం సందర్భంగా గురువారం డివిజన్ పరిధిలోని నందమూరినగర్, బృందావన్ కాలనీలో డీసీ ప్రశాంతి, ఏఈ రాజీవ్, వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి,పారిశుధ్య , ఎంటమాలజీ సిబ్బందితో కలసి కార్పొరేటర్ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కాలనీల్లో నెలకొన్న చెత్త చెదారాలను పూర్తిగా ఎత్తివేయాలని, నిర్మాణ వ్యర్థాలు పేరుకుపోకుండా వెంటనే తొలగించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు దామోదర్‌రెడ్డి, పోతుల రాజేందర్,రాగప్రసాద్, డాక్టర్ కోటేశ్వర్రావు, సైదేశ్వర్రావు, కృష్ణంరాజు, కుమారస్వామి, సుధాకర్‌రెడ్డి, మహిళా నేతలు మల్లంపల్లి విమల,లత, పర్వీన్,కృష్ణకుమారి, గంగా భవానీ, సద్దాం, సత్తార్ పాల్గొన్నారు.
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగరాన్ని ఉద్యాన నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ అన్నారు. గురువారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని హస్మత్‌పేటలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి నీరు పోసి, ప్రత్యేక వాహనాల ద్వారా చెత్త తరలింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఏఈ అరవింద్‌రావు, బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్‌గౌడ్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వేబోర్డు సభ్యుడు కర్రె జంగయ్య, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, కర్రె లావణ్యతో పాటు టీఆర్ఎస్ నాయకులు ఖదీర్, పోచయ్య, పాల్గొన్నారు.
బాలానగర్, జూలై 1 : ఫతేనగర్ డివిజన్లో పట్టణ ప్రగతిని పరుగులు పెట్టిస్తానని డివిజన్ కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని శోభనకాలనీ దోబి ఘాట్ సమీపంలో చెత్త తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నగర కీర్తిని పతాకస్థాయిలో నిలిపేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో సురేందర్నాయుడు, ఎస్ఎఫ్ఏ సుభాష్, బాలాచారి, స్థానికులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్ధీన్ గురువారం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రినగర్‌లో మొక్కలను నాటారు. కార్యక్రమంలో రాములు, బాబా, శ్రీనివాస్‌రెడ్డి, పుష్పలత, నూర్, సుదర్శన్, హమీద్, రియాజ్, రేవతి, లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ నాయకులతో కలసి పరిసరాలను శుభ్రం చేశారు.