కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 29 : దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్ ఫ్లై ఓవర్‌కు బాబూ జగ్జీవన్‌రామ్ నామకరణం చేసేందుకు ఎమ్మెల్యే కృష్ణారావు ప్రతిపాదించగా.. మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు బొట్టు విష్ణు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు, దళిత సంఘాల నాయకులు ఎమ్మెల్యేనుకలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత సాధికారత పథకాన్ని ప్రారంభించారన్నారు.
పేద దళితులకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందించి వారికి చేయూతనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆరేనని కొనియాడారు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్ పేరును ఫ్లై ఓవర్‌కు పెట్టడం సబబుగా ఉంటుందని పేరును ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ, దళిత సంఘాల నేతలు రవీందర్, అనిల్ మాదిగ, మహేందర్, యాదగిరి, పెద్దిరాజు, కృష్ణ, బండి సుధ, మూర్తి, ప్రభాకర్, నర్సింహ తదితరులు ఉన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 29 : కేపీహెచ్‌బీ కాలనీ వై కుంఠధామాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయనున్న ట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నా రు. మంగళవారం కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లోని హిం దూ శ్మశానవాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశానవాటికలో ఎలక్ట్రికల్ దహనవాటిక, సాధారణ దహనవాటిక, అంతిమ పూజలు నిర్వహించేందుకు ప్రత్యేక గదులు, నీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. శ్మశానవాటికను పార్కును తలపించేలా గార్డెనింగ్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. హిందూ, క్రిస్టియన్ శ్మశానవాటికలను సైతం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేజ్, భువనవిజయం గ్రౌండ్లలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను ఎమ్మెల్యే కృష్ణారావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కేపీహెచ్‌బీ కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాలనీ మొదటి రోడ్డులో ప్లే పార్కుతో పాటు పలు క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తెచ్చామని తద్వారా క్రీడాకారులకు, సాధారణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
ఈనెల 4న మంత్రి కేటీఆర్ పర్యటనలో గాంధీ విగ్ర హం ప్రారంభించేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులో గాంధీ కాం స్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. గార్డెనింగ్‌తో పాటు విద్యుత్ వెలుగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ రవికుమార్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రావు, మాజీ కార్పొరేటర్ బాబూరావు, టీఆర్ఎస్ నేతలు, డీఈ శ్రీదేవి, ఏఈ సాయిప్రసాద్ ఉన్నారు.