కేపీహెచ్‌బీ కాలనీ, మే 31 : తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాల(State formation celebrations) ముగింపు వేడుకలను బీఆర్ఎస్(BRS) పార్టీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తాం. ఈ వేడుకలలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishnarao) అన్నారు. వేడుకలలో భాగంగా శనివారం సాయంత్రం నగరంలోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుంచి అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.
అలాగే ఆదివారం ఉదయం కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు ఉంటాయని..మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.