కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 10 : ట్వీన్ సిటీస్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎల్లప్పుడు అండగా ఉంటానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కూకట్పల్లి డివిజన్ ఏవీబీపురంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణల సమక్షంలో కూకట్పల్లి శాఖ ట్వీన్ స్విటీస్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు పి.సత్యనారాయణ, ప్రధానకార్యదర్శి వై.తేజారావులతో పాటు కమిటీ సభ్యులంతా ప్రమాణాస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భవననిర్మాణా రంగంలో కష్టపడి పనిచేస్తున్న కార్మికులందరికి ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు. సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు ధర్మారావు, ధారాసింగ్, ఖగేష్, నారాయణస్వామి తదితరులు ఉన్నారు.