కాచిగూడ : ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎల్లవేళల అందుబాటులో ఉంటానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (MLA Kaleru Venkatesh ) అన్నారు. కాచిగూడ డివిజన్ కాచిగూడ, బర్కత్‌పుర, తదితర బస్తీలలో ఎమ్మెల్యే కాలేరు, కార్పొరేటర్ ఉమారమేశ్తో కలిసి పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బస్తీవాసులు మాట్లాడుతూ కొన్ని రోజులుగా లోఫ్రెషర్‌తో నీటి సమస్య తలేత్తుతుందని, స్పీడ్‌బ్రేకర్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ సమస్యలు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తాననని హామీ ఇచ్చారు. ఏ డివిజన్లోనైన డ్రైనేజీ,నీటి సమస్య వచ్చిన వెంటనే అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
నియోజకవర్గంలోని డివిజన్లను అభివృద్దిచేస్తూ, మౌళిక సదుపాయలు కల్పించేందుకు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఆయన వెంట జలమండలి డీజీఎం కృష్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్‌యాదవ్, కన్నె రమేశ్‌యాదవ్, డాక్టర్ శిరీషాయాదవ్, ఓం ప్రకాశ్‌యాదవ్, ధాత్రిక్ నాగేందర్బాబ్జి, సుభాశ్పటేల్, బబ్లూసింగ్,అరవింద్, మహేశ్‌కుమార్, శ్రీకాంత్‌యాదవ్,అంటో, మల్లికార్జున్, బి.కృష్టాగౌడ్ పాల్గొన్నారు.