కాచిగూడ, జూలై 8: అంబర్‌పేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సహకారంతో సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సమస్యలను తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్‌లో భాగంగా శనివారం 4 గంటల పాటు డివిజన్లోని బర్కత్‌పురలోని నాత్వైభవ్ అపార్ట్మెంట్, వీహెచ్ఎస్ అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి, అనంతరం అపార్ట్మెంట్ వాసులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అపార్ట్మెంట్ల సమీపంలో చెత్త వేయడం, సీసీ కెమారాలు, కుక్కల బెడదను పరిష్కరించాలని అపార్ట్మెంట్ వాసులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గాల కంటే అంబర్‌పేటను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తిర్చిదిద్దుతానని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థను త్వరిగతిన ఆధునీకరిస్తామని అన్నారు. డివిజన్ల అభివృద్ధికి యుద్ధ ప్రతిపాదికన సత్వర చర్యలు చేపడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు, జీహెచ్ఎంసీ డీసీ వేణుగోపాల్, ఏఎంహెచ్ఓ జ్యోతిబా యి, తిరుపతినాయక్, బర్కత్‌పుర అపార్ట్మెంట్ వాసు లు పాల్గొన్నారు.
బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలి..
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టె బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బోనాల సందర్భంగా నింబోలిఅడ్డా, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ వాడకం అధికంగా ఉంటుందని, బోనాలు నిర్వహించే పరిసర ప్రాంతాల ఇండ్లలో నిత్యం విద్యుత్‌కు అంతరాయం ఏర్పాడుతుందని అన్నా రు. అందుకు ఆ ప్రాంతంలో మొబైల్ ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకుడు ము న్నాసింగ్ ఆధ్వర్యంలో శనివారం బస్తీ ప్రజలు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే నింబోలిఅడ్డా ప్రాంతంలో మొబైల్ ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేయిస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోవింద్‌సింగ్, సుదేంద్కుమార్, విక్రమ్‌సింగ్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..
విద్యార్థులు కష్టపడి చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బర్కత్‌పురలోని రెడ్డి బాలికల వసతి గృహాన్ని శనివారం ఎమ్మె ల్యే సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లోని భోజన, తదితర సౌకర్యాలను స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
ఇటీవల అనారోగ్యానికి గురై ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొం దిన గోల్నాకకు చెందిన లక్ష్మీనారాయణకు సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి రూ.60వేల విలువగల చెక్కు మంజూరైంది. శనివారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ బాధితుడికి ఆ చెక్కు అందజేశారు.
– గోల్నాక, జూలై 8