గోల్నాక, అక్టోబర్ 4 : నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం గోల్నాక డివిజన్లోని జిందాతిలిస్మాత్ వద్ద రూ.10 లక్షల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నామన్నారు. అనంతరం బస్తీలో పర్యటించిన ఆయన స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారును ఆదేశిచారు. కార్పొరేటర్ దూసరి లావణ్య మాట్లాడుతూ.. గోల్నాక డివిజన్ వ్యాప్తంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సహకారంతో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైపులైన్ల ఏర్పాటు పనులను ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, టీఆర్ఎస్ నాయకులు కొమ్ము శ్రీనివాస్, భూపతి లక్ష్మణ్, భరత్‌రాజ్, ఆర్కే బాబు, రాము, లింగంగౌడ్, మధు, రాజేశ్, ప్రభాకర్, నర్సింగ్‌యాదవ్, రాజు, ఉమేశ్, మల్లేశ్‌గౌడ్, అఫ్సర్, ముజఫర్‌ఖాన్, లక్ష్మి, ఉమ, ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.