అంబర్‌పేట / కాచిగూడ, సెప్టెంబర్ 9 : నల్లకుంట డివిజన్ రత్నానగర్ హనుమాన్‌గుడి వద్ద రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న మంచినీటి పైపులైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్ని రోజులుగా రత్నానగర్‌లో మంచినీటి సమస్య ఉందని, దాని పరిష్కారానికి ఈ పైపులైన్ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సన్యాసిరావు, ఏఈ భావన, టీఆర్ఎస్ నాయకులు దిడ్డి రాంబాబు, విజితారెడ్డి, బస్తీ నాయకులు ఈశ్వర్, రాముయాదవ్, భాస్కర్, కిశోర్, ప్రసాద్, నరేందర్, మురళీకృష్ణ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని చెప్పల్‌బజార్ హరిమాసీద్ సమీపంలో రూ.8 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన మంచినీటి పైపులైన్ పనులను గురువారం కాచిగూడ కార్పొటర్ ఉమాదేవితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెం కటేశ్ ప్రారంభించారు. అనంతరం బస్తీలో ఎమ్మెల్యే పర్యటించి స్థానికుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ని యోజకవర్గంలోని డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నె రమేశ్‌యాదవ్, సునీల్బిడ్లాన్, బి.కృష్టాగౌడ్,డాక్టర్ శిరీషాయాదవ్, ఓం ప్రకాశ్‌యాదవ్, డీజీఎం సన్యాసిరావు, ఏఈ భావన, దిడ్డి రాం బాబు, నాగేందర్బాబ్జి, బబ్లూ, రవీందర్‌యాదవ్, బం డారు సంతోష్‌కుమార్, తుమ్మల నర్సింహరెడ్డి, పట్లూరి సతీశ్, రాజేశ్, శ్రీకాంత్, బాబు, క్షీర్సాగర్, రవియాదవ్, మల్లికార్జున్, రమాదేవి, మురళి, పంకజ్, పంచాక్షరి, ఆసీఫ్‌అలీ తదితరులు పాల్గొన్నారు.