గోల్నాక, సెప్టెంబర్ 8 : అనారోగ్యానికి గురై పలు దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం గోల్నాకలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పా టు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
అంబర్‌పేట డివిజన్ ఆజాద్‌నగర్‌కు చెందిన అజ్మతున్నీసాకు రూ. 2లక్షలు, అంబర్‌పేట బాపునగర్‌కు చెందిన నూర్జాన్ బేగంకు రూ. 23వేలు, సైదాబాద్ మాదన్నపేటకు చెందిన ఎన్.రాజుకు రూ. 12వేలు, బాగ్‌అంబర్‌పేట తురాబ్‌నగర్‌కు చెందిన అజీజా బేగానికి రూ. 14వేలు, చార్మినార్ ఖాజీపూరకు చెందిన రహ్మత్బీకు రూ. 52వేలు, కాచిగూడకు చెందిన మధుసూదన్‌కు రూ. 60వేలు, హియాయత్‌నగర్ దత్తనగర్కు చెందిన బేగానికి రూ.40వేలు, బాగ్‌అంబర్‌పేట పోచమ్మబస్తీకి చెందిన శ్రీకాంత్‌కు రూ.25వేలు, అంబర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన పి.గణేశ్‌కు రూ.36వేలు, నాంపల్లికి చెందిన ప్రసాద్‌కు రూ. 60వేలు, ఇసామియాబజార్‌కు చెందిన కనకయ్యకు రూ. 24వేలు, అంబర్‌పేట న్యూప్రేమ్‌నగర్‌కు చెందిన బిపాషకు రూ. 24వేలు, బాగ్‌అంబర్‌పేట మల్లికార్జుననగర్‌కు చెందిన వి.కృష్ణారావుకు రూ. 60వేలు, అంబర్‌పేట పటేల్బాడాకు చెందిన నసీంబేగానికి రూ. 36వేలు, బాపునగర్‌కు చెందిన వేణుగోపాల్‌కు రూ.60వే లు విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.