కాచిగూడ,సెప్టెంబర్ 4: రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని పార్కులను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బర్కత్‌పుర విక్రమ్‌నగర్ పార్కులో శనివారం ఎమ్మెల్యే పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే తరాలకు పచ్చదనాన్ని అందివ్వడానికి తమవంతు బాధ్యతగా పార్కులను సంరక్షించుకోవాలని సూచించారు. విక్రమ్‌నగర్ పార్కులో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, సంతోష్, ఏఈ ఫరీద్, ప్రేరణ, హార్టికల్చర్ మేనేజర్ సత్య, బాలకృష్ణ, రాఘవేంద్రరెడ్డి, నారాయణగౌడ్, సందీప్, గుప్త, సురేశ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.