అంబర్‌పేట/కాచిగూడ, ఆగస్టు 29 : గంగపుత్రులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే కాలేరు వెంటకటేశ్ అన్నా రు. హుస్సేన్‌సాగర్‌లో ఆదివారం నిర్వహించిన గంగ తెప్పోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి గడప శ్రీహరి, అంబర్‌పేట నియోజకవర్గం గంగపుత్ర సం ఘం ప్రతినిధులు పూస నర్సింహ, స్వరూప, మెట్టు ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.
గోల్నాక, ఆగస్టు 29 : అనారోగ్యానికి గురై పలు దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ ర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలే రు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలో ని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. మూసారాంబాగ్‌కు చెందిన కె.పద్మావతికి రూ.33వే లు, అంబర్‌పేటకు చెందిన షాన్వాజ్బేగానికి రూ. 8వేలు, కాచిగూడ నింబోలిఅడ్డకు చెందిన ఎస్. శంకరప్పకు రూ. 6వేలు, అంబర్‌పేట అంబేద్కర్‌నగర్‌కు చెందిన బి. లింగయ్యకు రూ. 60వేలు, నల్లగొండకు చెందిన పి.అరుణకు రూ. 19వే లు, బాగ్‌అంబర్‌పేట తురాబ్‌నగర్‌కు చెందిన జి. ప్రవీణకు రూ. 29వేలు, అంబర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన మహ్మద్ అస్గర్‌కు రూ. 54 వేలు, వరంగల్‌కు చెందిన సయ్యద్ అంకుష్‌కు రూ. 24వేలు, హన్మకొండకు చెందిన మస్రత్ బేగానికి రూ. 27వేలు విలువగల చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అందజేశారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంబర్‌పేట, ఆగస్టు 29: అశ్రద్ధ వహించకుండా ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ శారదానగర్‌లో ప్రజలు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించుకున్న నేపథ్యంలో శారదానగర్‌ను వందశాతం వ్యాక్సినేటెడ్ కాలనీగా ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు ఎమ్మెల్యే సర్టిఫికకెట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు ఇంకా టీకా వేసుకోని వారందరూ ముందుకు వచ్చి బస్తీల్లో ఏర్పాటు చేస్తున్న మొబైల్ కేంద్రాల దగ్గరకు వచ్చి టీకా వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో రజిత, డాక్టర్ స్రవంతి, సిబ్బంది శ్యామల, శోభ, విజయలక్ష్మి, సరస్వతి, డీఈ సంతోష్, వర్క్ ఇన్స్‌స్పెక్టర్ రవి, కాలనీవాసులు యాదవరెడ్డి, శేఖరయ్య, విఠల్‌గౌడ్, సత్యనారాయణగౌడ్, రాములు, పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.