అంబర్‌పేట/ గోల్నాక, ఆగస్టు 26 : నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. గురువారం గోల్నా క డివిజన్లోని సాయిబాబా ఆలయం లైన్లో రూ.13 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. కార్పొరేటర్ లావణ్యగౌడ్ మాట్లాడుతూ… అంబర్‌పేట డివిజన్ వ్యాప్తంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సహకారంతో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్ల ఏర్పాటు పనులను ము మ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, వ ర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, టీఆర్ఎస్ నాయకులు ఆర్కే బాబు, లక్ష్మణ్, సంతోష్, లింగంగౌడ్, బుచ్చిరెడ్డి, నర్సింగ్‌యాదవ్, లింగం, రాజు, మల్లేశ్, ప్రభాకర్, యూసుఫ్, ముజఫర్, లక్ష్మి, ఉమ, ధనలక్ష్మి పాల్గొన్నారు.
అంబర్‌పేట : బాగ్ అంబర్‌పేట డివిజన్ రెడ్ బిల్డింగ్ వద్ద రూ.12 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ స్థానిక కార్పొరేటర్ బి. పద్మావెంకట్రెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం కాలనీల్లో క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేసి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, వర్క్ఇన్స్పెక్టర్ రవి, నాయకులు మోరశ్రీరాములు ముదిరాజ్, శివాజీయాదవ్, నర్సింగ్, మహేందర్‌రెడ్డి, యోబు, శ్రీనివాస్, వెంకట్, చందర్, వెంకట్‌రెడ్డి, కృష్ణాగౌడ్, ఏడెల్లి అజయ్‌కుమార్, చుక్క జగన్, కోడూరు సురేశ్, అచ్చిని రమేశ్, రఘునందన్, మిర్యాల శ్రీనివాస్, సాయన్న, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.