అంబర్‌పేట, ఆగస్టు 19 : నల్లకుంట డివిజన్ న్యూ ఇందిరానగర్ బస్తీలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. న్యూ ఇందిరానగర్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, గురువారం ఉదయం 5 గంటల సమయంలో ఆ ఏరియా జలమండలి మేనేజర్ రోహిత్‌తో కలిసి అక్కడ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి తాగునీటి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాగునీరు, డ్రైనేజీకి సంబంధించిన సమస్యలను వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రోజు విడిచి రోజు వచ్చే తాగునీటి లోప్రెషర్‌తో వస్తుందన్నారు.
అలాగే ఇక్కడ డ్రైనేజీ పైప్‌లైన్ వేయడం కోసం రోడ్డును తవ్వారని, పనులు పూర్తైనా తిరిగి రోడ్డు నిర్మాణం చేపట్టలేదని చెప్పారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరగా కొత్త తాగునీటి పైప్‌లైన్ పను లు చేపట్టి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అన్నారు. తవ్విన రోడ్డుకు మరమ్మతులు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈ సంతోష్, జలమండలి మేనేజర్ రోహిత్, న్యూ ఇందిరానగర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకాశ్, శంకర్, హన్మంతు, అంజిచారి, నరేశ్, ఎం. యాదగిరి, బాలచందర్, జె. శ్రీనివాస్, బిజ్జి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాచిగూడ : స్థానికుల ఫిర్యాదు మేరకు ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మార్నింగ్ వాక్‌లో భాగంగా పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. సమస్యలపై స్థానికులు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. స్థానికులను వేధిస్తున్న నీటి కాలుష్యం, లోప్రెషర్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని అన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థను అతిత్వరలో ఆధునీకరించనున్నట్లు ఆయన చెప్పారు. అధికారులు సంతో ష్, సుధాకర్‌తో పాటు బస్తీ వాసులు పొత్కల సంతోష్, శంకర్, హనుమంతు,అంజిచారి, నరేశ్, బాలచందర్, శ్రీనివాస్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.