కాచిగూడ / గోల్నాక, ఆగస్టు 18: పేదల కోసమే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకు వచ్చిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట డివిజన్లకు చెందిన 37 మంది పేదలకు రూ.37,04,292 ల కల్యాణలక్ష్మి చెక్కులను బుధవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి, నల్లకుంట కార్పొరేటర్ అమృత, హిమయత్‌నగర్ తాసీల్దార్ లలిత తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రవేశపెట్టిన దళితబందు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పొరుగు రాష్ర్టాల కంటే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నె రమేశ్‌యాదవ్, డిప్యూటీ తాసీల్దార్ ఆసీఫ్‌ఖాన్, స్సెషల్ ఆర్ఐ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యానికి గురై పలు దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం గోల్నాకలోని ఆయన క్యాంపు కార్యాల యం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌కు చెందిన రాములుకు రూ.6వేలు, అదే ప్రాంతానికి చెందిన అంకితకు రూ. 24వేలు, చప్పల్ బజార్‌కు చెందిన జి.శ్రీనివాస్‌రెడ్డికి రూ. 13,500, ప్రేమ్‌నగర్‌కు చెందిన దేవయ్యకు రూ. 9,500, రహత్‌నగర్‌కు చెందిన ఫర్జానా సుల్తానాకు రూ. 40వేలు, ఘట్కేసర్ మండలం ఏదులాబాద్కు చెందిన బి.వెంకటేశ్‌కు రూ.1,00,000, అంబర్‌పేటకు చెందిన ఉమామహేశ్వరికి రూ.26వేలు, పటేల్‌నగర్‌కు చెందిన బాలకృష్ణకు రూ. 24వేలు, కుమ్మరివాడీకి చెందిన ప్రశాంత్‌కు రూ.5వేలు, ప్రేమ్‌నగర్‌కు రామచంద్రుడుకు రూ. 60వేలు, ఛే నంబరుకు చెందిన నరేశ్చారికి రూ. 18వేలు, అహ్మద్‌నగర్‌కు చెందిన రషీదాబేగంకు రూ. 16వేలు, ప్రేమ్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌ఖాన్‌కు రూ. 18వేలు, బాగ్‌అంబర్‌పేటకు చెందిన విజయలక్ష్మికి రూ. 32వేలు, విలువగల చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.