గోల్నాక, ఆగస్టు 12 : అనారోగ్యానికి గురై పలు దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం గోల్నాకలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోల్నాక డివిజన్ ఖాద్రీబాగ్‌కు చెంది సయ్యద్నదీం అహ్మద్‌కు రూ.2 లక్షలు, గోల్నాక జిందాతిలస్మాత్ కాలనీకి చెందిన జోసఫ్‌కు రూ. 60వేలు విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని అన్నారు.