గోల్నాక, ఆగస్టు 11 : నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇందుకు సం బంధించి కొత్త పైపులైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం గోల్నాక డివిజన్లోని న్యూగంగానగర్లో రూ.10.50లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైపులైన్ పనులను కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్లో ఎలాంటి డ్రైనేజీ సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. డివిజన్లో మౌలిక వసుతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బస్తీల్లో పర్యటించి, స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారును ఆదేశించారు. ఈకార్యక్రమంలో జలమండలి డీజీఎం సతీశ్, ఏఈ రోహిత్, బస్తీవాసులు పూర్ణచందర్రావు, శివ, శంకర్, సతీశ్, రాజుగౌడ్, ముత్యా లు, రత్నం, లింగమ్మ, లక్ష్మమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ప్రమోద్, లక్ష్మీబాయి, టీఆర్ఎస్ నాయకులు ఆర్కే బాబు, లింగంగౌడ్, నర్సింగ్యాదవ్, వినోద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.