గోల్నాక, ఆగస్టు 9: ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా సోమవారం అంబర్‌పేటలోని కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర సీపీ అంజనీకుమార్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, అడిషనల్ కమిషనర్ చౌహాన్, డీపీపీ రమేశ్, అడిషనల్ డీసీపీ మురళీధర్, కార్పొరేటర్ విజయ్‌కుమార్‌గౌడ్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ పోలీస్స్టేషన్లు పచ్చని అందాలతో ఆహ్లాదకర వాతావరణానికి నిలయాలుగా మారుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ అనిల్‌కుమార్, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.