అంబర్‌పేట, జూలై 23 : బాగ్‌అంబర్‌పేట డివిజన్ తురాబ్‌నగర్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కొంత కాలంగా తాము డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా శుక్రవారం జలమండలి అధికారులు, సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే తురాబ్‌నగర్‌లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. అక్కడి తీవ్రతను పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో వాటర్‌వర్క్స్ డీజీఎం సతీశ్, ఏఈ మాజిద్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు శ్రీరాములుముదిరాజ్, శ్రీనివాస్, కృష్ణ, సురేశ్, వెంకటేశ్, చిరంజీవి, అయూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.