కాచిగూడ, జూలై 1 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో నగర రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని, ముఖ్యంగా హైదరాబాద్ కీర్తి మరింతగా పె రగనుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అ న్నారు. పదిరోజుల పాటు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం కాచిగూడ డివిజన్లోని బస్తీలలో ఎమ్మెల్యే, కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి పర్యటించి డి విజన్‌లోని రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారాన్ని ఊ డ్చి, మట్టి కుప్పలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పచ్చదనం, పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు. ప్రజలు, యువత తమవంతు బాధ్యతగా స్వచ్ఛందంగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు రమేశ్‌యాదవ్, ఓం ప్రకాశ్‌యాదవ్, భీష్మా, కృష్ణాగౌడ్, సుభాశ్పటేల్, నర్సింహారెడ్డి, నాగరాజుగౌడ్, రమాదేవి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
గోల్నాక, జూలై 1 : పచ్చదనం, పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించామని కార్పొరేటర్ విజయ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. గురువారం ప్రేమ్‌నగర్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పలు శాఖల అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు సంతోశ్, కుశాల్, మల్లేశ్, దుర్గా, టీఆర్ఎస్ నాయకులు సతీశ్, దయాకర్, ప్రవీణ్ పటేల్, మహేశ్, యూసుఫ్‌బాబా, ఉదయ్ పాల్గొన్నారు.
గోల్నాక డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. గురువారం మారుతీనగర్‌లో పలు శాఖల అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. మంచి నీటి, మురుగు నీటి సమస్యలతో పాటు వీధిదీపాలు వెలగడం లేదని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆమె అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంబర్‌పేట, జూలై 1 : ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం అంబర్‌పేట సర్కిల్లో గురువారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో పాటు అన్ని డివిజన్ల కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని బస్తీలలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మరికొంత మంది కార్పొరేటర్లు ఆయా డివిజన్ల ప్రభుత్వ విభాగాల అధికారులతో పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డి డివిజన్లోని రామకృష్ణనగర్ కమ్యూనిటీహాల్లో అన్ని విభాగాల అధికారులతో సమావేశమై పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. బస్తీలలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. నల్లకుంట కార్పొరేటర్ వై.అమృత డివిజన్లోని నరేంద్రపార్కు కమ్యూనిటీహాల్లో అధికారులతో సమావేశమై డివిజన్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి వెంటనే కృషి చేయాలని సూచించారు.