గోల్నాక, జూన్ 25 : నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం అంబర్‌పేట డివిజన్లోని సీపీఎల్ లకోటియా పాఠశాల నుంచి పటేల్‌నగర్ చౌరస్తా వరకు రూ.44 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ ఇవిజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నామన్నారు. కార్పొరేటర్ విజయ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ… అంబర్‌పేట డివిజన్ వ్యాప్తంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సహకారంతో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్ల ఏర్పాటు పనులను ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సంతోష్, ఏఈ శ్వేత వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గా, టీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, అమనురి సతీశ్, మల్లేశ్‌యాదవ్, ఎర్రబోలు నరసింహారెడ్డి, లింగారావు, రామారావు, దయాకర్, రంగు సతీశ్, రాగుల ప్రవీణ్, జాకీబాబు, మహేశ్ముదిరాజ్, సింగజోగి శ్రీనివాస్, నాజయ్, రఘుభాబు, మహేశ్, ధరమ్, విష్ణు, శ్రీనివాస్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.