బంజారాహిల్స్: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికోసం సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరయిన రూ.2.54లక్షల విలువైన 5 చెక్కులను మంగళవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లబ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..పేదల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వారికి అవసరమైన సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.