హయత్‌నగర్, ఆగస్టు 22 : నియోజకవర్గంలోని ఆయా డివిజన్ల కాలనీల్లో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతామని ఎంఆర్డీసీ చైర్మర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని కట్టమైసమ్మ కాలనీ, షిర్డీనగర్, పర్వతనగర్ కాలనీల్లో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను హయత్‌నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాతుల చెరువు కట్ట కింద కాలనీలు ముంపునకు గురయ్యాయని తెలిపారు.
ఆయా కాలనీల్లో ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఊట రావడం వల్ల సెప్టిక్ ట్యాంకులు నిండిపోయి ప్రవహించాయన్నారు. జనవరి 23న ముంపునకు గురైన ఈ కాలనీల్లో పర్యటించి ప్రధాన సమస్యను గుర్తించి రూ.2 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపడుతున్నామని తెలిపారు. మీర్‌పేట, నందిహిల్స్, వనస్థలిపురం ఏరియాల నుంచి వస్తున్న వరదనీరు హయత్‌నగర్‌లోని కుమ్మరికుంట, బాతుల చెరువులోకి వచ్చి చేరుతుందని, దీంతో చెరువు దిగువన కాలనీలు ముంపునకు గురై సమస్యాత్మకంగా మారుతున్నాయని వివరించారు. దిగువన కాలనీల్లో ఊటను అరికట్టేందుకు వేసవికాలంలో చెరువు మరమ్మతులు చేపడుదామంటే వీలులేకుండా పోయిందన్నారు.
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ముంపు కాలనీల్లో విడుతల వారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. రూ.11 కోట్లతో చెరువు కింద కాలనీల్లో వరదనీటిని తరలించేందుకు ప్రత్యేకంగా ట్రంకులైన్ నిర్మాణ పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు. నూతనంగా వెలిసిన కాలనీల్లో జనసాంద్రతను దృష్టిలో పెట్టుకొని దశలవారీగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతామని హామీనిచ్చారు. మరో రెండేళ్ల లోపు హయత్‌నగర్ డివిజన్లోని సౌత్ కాలనీల్లో కూడా యూజీడీ లైన్లు, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసానిచ్చారు.
నియోజకవర్గంలోని ప్రజలు కొవిడ్ వ్యాక్సిన్‌ను వందశాతం వేయించుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారని, కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులు ముందుకొచ్చి సహకరించాలన్నారు. ఆయా కాలనీల్లో మిగిలిపోయిన వారికి మొబైల్ వ్యాక్సిన్ ఏర్పాటు చేసి వేయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గుడాల మల్లేశ్‌ముదిరాజ్, సింగిరెడ్డి మల్లీశ్వరి, గంగని నాగేశ్, ఏర్పుల ప్రసన్న, మెగావత్ గోవర్ధన్, కరంటోతు శంకర్, దేవరాం ప్రకాశ్, బోడ శ్రీరాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యానాల కృష్ణారెడ్డి, మనోజ్, లింగం, సందీప్, రొయ్య భాస్కర్, బీజేపీ రాష్ట్ర నాయకుడు బండారి భాస్కర్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఉగాది ఎల్లప్ప, నాయకులు ఎర్రవెల్లి సత్యనారాయణ, పాండాల శ్రీధర్‌గౌడ్, శ్రీకాంత్ గౌడ్, అశోక్, సంతోష్, గంగని శ్రీను, లక్ష్మిదాస్, జనార్దన్, సురేశ్, రవిబాబు, జంగం, జాంజానాయక్, భగవాన్, అన్మగల్ కాలనీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కె.వీరస్వామి, జనరల్ సెక్రటరీ పి.మల్లారెడ్డి, వైస్ చైర్మన్లు ఎస్.రాములు, ఎం.దేవోజీనాయక్, పి.బాల్‌రెడ్డి, పి.శ్రీనివాస చారి, జాయింట్ సెక్రటరీలు ఎం.గణేశ్‌గౌడ్, సీహెచ్ శ్రీకాంత్‌రెడ్డి, ఎం.రమేశ్, ఎం.వంశీరెడ్డి, జె.నర్సింహ, బి.మహేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు వై.శంకర్‌రెడ్డి, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
వనస్థలిపురం : పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ వినాయక చవితిని జరుపుకొందామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం వనస్థలిపురంలో మట్టి గణపతి విగ్రహన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రశాంత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన శెర్విన్ ఇన్ఫ్రా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్యం నుంచి నగరాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పనలో మన నగరం అగ్రగామిగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇలాంటి నగరాన్ని కాలుష్యరహితంగా మార్చాలని సూచించారు. ప్లాస్టర్‌ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి హాని చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్ రావుల వెంకటేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, సంజయ్‌కుమార్, వేములయ్యగౌడ్, బావన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.