మన్సూరాబాద్, ఆగస్టు 25: శివారు కాలనీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్‌నగర్ పరిధి బాలాజీనగర్ కాలనీలో మురుగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 20 లక్షలతో డ్రైనేజీ పైపులైన్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించడాన్ని హర్షిస్తూ బుధవారం కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు జి. మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ. శ్రీనివాస్ గౌరవ అధ్యక్షుడు కొండారెడ్డి, కాలనీవాసులు యాదగిరి రావు, సురేశ్, మోహన్‌రెడ్డి, భిక్షపతి, అనిల్‌రెడ్డి, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
చంద్రపురికాలనీ రోడ్డునం. 1, 5లలో ప్రైవేటు వాహనదారుల అక్రమ పార్కింగ్‌ను అరికట్టాలని కోరుతూ బుధవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి కాలనీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు రుద్ర యాదగిరి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. కాలనీలోని రోడ్డునం. 1, 5లలో ప్రైవేటు వాహనాలను నిలపడం వలన కాలనీవాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ఎన్. వేమారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎం. వెంకట్‌రెడ్డి, కార్యదర్శి ఎన్. అంజయ్య, కోశాధికారి పి. సోమిరెడ్డి, సంయుక్త కార్యదర్శి వి. వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.