మన్సూరాబాద్,చంపాపేట ఆగస్టు 24: టీకాలు వేసుకునేందుకు ప్రజలకు ఇబ్బందుకు ఎదురవ్వకుండా ఉండేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి జడ్జెస్కాలనీలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే జడ్జెస్కాలనీతో పాటు సహారాస్టేట్స్ కాలనీలో పర్యటించి కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, టీకా తీసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల్లో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని టీకాలు వేసుకోవాలని సూచించారు. టీకా తీసుకోవడం ద్వారానే కరోనా నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, ఏఎంహెచ్ఓ మంజులవాణి, పున్ననాయక్, రజిత, ఎంఓ డాక్టర్ శ్వేత, హెచ్ఈఓ వెంకటాచార్య, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్‌యాదవ్, నాయకులు జక్కిడి రఘువీర్‌రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఆనంద్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చంపాపేట డివిజన్ పరిధిలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆయన సందర్శించారు. మారుతీనగర్ కాలనీలో పర్యటించి టీకాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరు కొవిడ్ టీకా తీసుకోవాలని సూచించారు. ఈ కార్య్రకమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, మాజీ వార్డు సభ్యుడు ముడుపు రాజిరెడ్డి, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ ధర్మకర్త చేగోని మల్లేశ్, నాయకులు జి. జంగయ్య, కొత్తపేట ప్రభాకర్, నిష్కాంత్రెడ్డి, గూడూరు గౌతంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.