వనస్థలిపురం, ఆగస్టు 23: మ్యాన్‌హోల్ ఘటన బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇంటి తాళాలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సోమవారం అందజేశారు. మృతులు శివ, అంతయ్య కుటుంబాలకు ఇప్పటికే రూ.15 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేశారు. కాగా, వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయిస్తామని గతంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హామీ ఇచ్చారు. హామీకి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులకు సోమవారం ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాటపై నిలబడే నైజం తమదని, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. వనస్థలిపురం రైతుబజార్ వద్దనున్న డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో వారికి ఇండ్లను కేటాయించామన్నారు. ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంహెచ్‌వో మంజుల వాణి, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.