ఎల్బీనగర్, ఆగస్టు 21 : కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న చైల్డ్ ఫండ్ స్వచ్ఛంద సంస్థ హోప్ ప్రాజెక్ట్ సేవలు అభినందనీయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కొనియాడారు. శనివారం ఎల్బీనగర్లో చైల్డ్ ఫండ్ స్వచ్ఛంద సంస్థ హోప్ ప్రాజెక్టు ద్వారా అవగాహన కల్పించే మొబైల్ వ్యాన్‌ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, లింగాల రాహుల్‌గౌడ్, రవిచారి, తిలక్, దీప్ లాల్, శ్రావణ్‌కుమార్, యాదగిరి, యాదయ్య, పులి వెంకట్, రాంరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, శ్రీశైలం, యశోద తదితరులు పాల్గొన్నారు.