మన్సూరాబాద్/ఎల్బీనగర్, ఆగస్టు 15: మలిదశ ఉద్యమకారుడు అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి త్యాగాన్ని యావత్ తెలంగాణ ప్రజలు ఏనాటికీ మరువలేరని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు సమీపంలో ఆదివారం మలిదశ ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంత్‌చారి జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని తెలిపారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లిదండ్రులు కాసోజు శంకరమ్మ, వెంకటాచారి హాజరై శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకు ప్రశాంత్‌గౌడ్, రుద్ర యాదగిరి, డప్పు వెంకటేశ్, విజయభాస్కర్ రెడ్డి, జహంగీర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.