వనస్థలిపురం, ఆగస్టు 11 : ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధితో ఎంతోమంది పేదలకు లబ్ధి చేకూరుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీకి చెందిన గడల రాజు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ దవాఖానలో చేరాడు. వైద్యానికి ఎక్కువ ఖర్చు అవుతుండటంతో ఎమ్మెల్యే సిఫారసుతో సీఎంఆర్ఎఫ్కు దరకాస్తు చేసుకున్నాడు. ఆయనకు రూ.46వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కును ఎమ్మెల్యే బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కరానాతో ఇప్పటికే ఎంతో నష్టపోయామన్నారు. ప్రజారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేస్తున్నామన్నరు. కార్యక్రమంలో టీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.