వనస్థలిపురం, ఆగస్టు 10 : ఆపద సమయంలో ఆదుకునే సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. హస్తినాపురం సాగర్ ఎన్క్లేవ్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ కార్పెంటర్ పని చేస్తుండగా.. ప్రమాదానికి గురయ్యాడు. వైద్యానికి ఆర్థిక స్థోమత సహకరించకపోవడంతో ఎమ్మెల్యే సిఫారసుతో సీఎంఆర్ఎఫ్కు దరకాస్తు చేసుకున్నాడు. ఆయనకు రూ.42,500 మంజూరయ్యాయి. ఆ చెక్కును మంగళవారం బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్నపుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తామన్నారు. కార్యక్రమంలో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ తిరుమలరెడ్డి, రమావత్ శ్రీనివాస్ నాయక్, సత్యం చారి, తదితరులు పాల్గొన్నారు.