వనస్థలిపురం, ఆగస్టు 7 : సాహెబ్‌నగర్ డ్రైనేజీ దుర్ఘటన విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సరికాదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శనివారం సంఘటనా స్థలంలో జరుగుతున్న తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల నాయకులు వస్తారు, పోతారు తప్ప ఇక్కడి ఉండి పనిచేయించాల్సి తామే అన్నారు. అంతయ్య మృతదేహం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పద్మావతి బ్యాంకు కాలనీ నుంచి పసుమాముల చెరువు వరకు ఉన్న 250 మ్యాన్‌హోళ్లను పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఇక్కడ తవ్వకాలు జరపుతున్నామని, పసుమాముల చెరువులో 3 బోట్లతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. తవ్వకాలతో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులకు సర్ధిచెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని, సెర్చ్ ఆపరేషన్ పూర్తికాగానే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, డీసీ మారుతీ దివాకర్, ఈఈ రాజయ్య, శ్రీధర్‌గౌడ్, బుచ్చిరెడ్డి, సుమన్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, రాఘవేందర్రావు పాల్గొన్నారు.
హయత్‌నగర్, ఆగస్టు 7 : డివిజన్ పరిధిలోని శాంతినగర్‌లో శ్రీకంఠ మహేశ్వర స్వామి, ఎల్లమ్మ, మైసమ్మ దేవస్థానంలో బోనాల సందర్భంగా శనివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, హయత్‌నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ కార్యదర్శి చెన్నగోని శ్రీధర్‌గౌడ్, నక్క రవీందర్‌గౌడ్, నక్క దర్శన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్ : చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. చింతలకుంటలోని ఎల్పీటీ మార్కెట్లో మర్చంట్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేనేత వస్ర్తాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అందజేస్తున్న బతుకమ్మ చీరెలు చేనేత రంగానికే చెందినవని తెలిపారు.
గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు యూనిఫాంను చేనేత వస్ర్తాలతోనే తయారు చేసి ఇస్తున్నారని తెలిపారు. ఎల్పీటీ మర్చంట్ కమిటీ ఆధ్వర్యంలో కొవిడ్ బారినపడి మృతి చెందిన ఆరు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.10,116 చొప్పున ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చేతులమీదుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనంతుల రాజిరెడ్డి, రుద్ర యాదగిరి, ఎల్పీటీ మర్చంట్ కమిటీ అధ్యక్షుడు గంజి కిశోర్, గౌరవ అధ్యక్షుడు బడుగు అశోక్, ఉపాధ్యక్షుడు నామని నర్సింహ, కార్యదర్శి పాండురంగం, కోశాధికారి పెండెం రాజు, తదితరులు పాల్గొన్నారు.