వనస్థలిపురం, ఆగస్టు 6 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలు పేదలకు వరమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం 126 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, దయానంద్ గుప్తాతో కలిసి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు ఆడబిడ్డ పెండ్లి చేసేందుకు పడుతున్న కష్టాలను సీఎం కేసీఆర్ కళ్లార చూశారన్నారు. వారికి అండదండగా ఉండేందుకు ఈ పథకాలను అమలు చేశారన్నారు. ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే గతంలో ఆర్థిక ఇబ్బందులు పడేవారని, కల్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలు వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా వివాహాలు చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరకాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, రాజరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.