ఎల్బీనగర్, ఆగస్టు 02 : పేదల కడుపు నింపే యజ్ఞానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పేదలకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే సీఎం కేసీఆర్ దరఖాస్తులు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులను జారీ చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని దరఖాస్తులు చేసుకున్న 14 వేల మందికి రేషన్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ బాల సరోజ, నాయకులు రఘుమారెడ్డి, రవి ముదిరాజ్, ప్రకాశ్‌గుప్తా, మల్లేశ్‌గౌడ్, రాజిరెడ్డి, నిష్కాంత్రెడ్డి, గౌతంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.