వనస్థలిపురం, జూలై 13 : నియోజకవర్గంలో తాగునీటి పైపులైన్ల నిర్మాణానికి రూ.6.67కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లోని గాయత్రినగర్ బ్యాంకు కాలనీ, పాపిరెడ్డి కాలనీలో రూ.53.12లక్షలతో నిర్మించనున్న తాగునీటి పైపులైన్ పనులను కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 9 డివజన్లలోని 36కాలనీలకు పూర్తిగా తాగునీటి వసతి కల్పించేందుకు ఈ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
నాగోల్ డివిజన్లోని ఆప్కో కాలనీ, పతుళ్లగూడ, నర్సింహాస్వామి కాలనీ, మన్సూరాబాద్ డివిజన్లోని జడ్జెస్ కాలనీ, ప్రియదర్శిని కాలనీ, చండీశ్వర్ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, పవనగిరి కాలనీ, కేవీఎన్రెడ్డిలు, హయత్‌నగర్ డివిజన్లోని శంకర్‌నగర్, మైత్రి మధుర కాలనీ, ఆర్టీసీ కాలనీ, హస్తినాపురం డివిజన్లోని దేవినగర్, షిర్డీసాయినగర్, భీమనగర్, లింగోజిగూడ డివిజన్లోని హరిజన బస్తీ, సౌభాగ్యనగర్, శ్రీనివాస కాలనీ, సమత నగర్, తిరుమల ఎన్క్లేవ్, కొత్తపేట డివిజన్లోని సీటీవో కాలనీ, బాలాజీ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, నాగేశ్వరరావు కాలనీ, కొత్తపేట గ్రామం, చంపాపేట డివిజన్లోని ముస్లిం బస్తీ, రెడ్డి బస్తీ, దుర్గా కాలనీ, శ్రీనిధి కాలనీ, చైతన్యపురి డివిజన్లోని న్యూ ఇందిరా కాలనీ, ఫణిగిరి కాలనీలో పైపులైన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
శివారు డివిజన్లలో కాలనీలు నూతనంగా ఏర్పడుతున్నందున వారికి నూతన పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పటికే సరిపడా నీటిని ఇంటింటికీ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ డైరెక్టర్ అనీల్ చౌదరి, త్రినేత్రాంజనేయ దేవస్థానం చైర్మన్ కొత్త శ్రీధర్‌గౌడ్, మాధవరం నర్సింహారావు, రాజిరెడ్డి, మహేందర్‌రెడ్డి, రఘురాంనేత, గాయత్రినగర్ బ్యాంకు కాలనీ అధ్యక్షుడు లక్ష్మీపతి, కార్యదర్శి శేఖర్, రవీందర్‌గుప్తా, శ్రీనివాస్, భిక్షమయ్య, అభిషేక్, రవి తదితరులు పాల్గొన్నారు.