మన్సూరాబాద్, జూలై 5: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. నాగోల్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 51.80 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, కాటెపల్లి జనార్దన్‌రెడ్డి, బొగ్గారపు దయానంద్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాతో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి, విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్ల పర్యవేక్షణలో నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
నాగోల్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులతో పాటు గ్రామస్తులు అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని అ న్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోనే జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ప్రసాద్, కార్పొరేటర్ చింతల అరుణ, మాజీ కార్పొరేటర్లు చెరుకు సంగీత, వజీర్ ప్రకాశ్‌గౌడ్, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవి, నాగోల్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కందికంటి కన్నాగౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ, నాగోల్ కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్, నాగోల్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బద్ధం ధనంజయ్ గౌడ్, నాయకులు చెరుకు ప్రశాంత్‌గౌడ్, అనంతుల రాజిరెడ్డి, సతీశ్‌యాదవ్, పల్లె సీతారాములు, జిలకపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.