మన్సూరాబాద్, జూలై 2: అణగారిన వర్గాల అభివృద్ధి కి నూతనంగా తీసుకువచ్చిన దళిత సాధికారత పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కత్తుల రాంబాబు ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరై సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధికారతతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. నిరుద్యోగులైన వంద మంది యువకులను గుర్తించి ఒక్కొక్కరికీ రూ. 10 లక్షలు మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, నాయకులు అనంతుల రాజిరెడ్డి, ఆడాల రమేశ్, తూర్పాటి చిరంజీవి, మల్లెపాక యాదగిరి, ఏర్పుల గాలయ్య, కాటెపాక రవి, పారంద నర్సింగ్‌రావు, దీప్లాల్, స్కైలాబ్, రాములు, జంగయ్య, ప్రకాశ్, ప్రభాకర్, మహేశ్, రాము, బాబు గౌడ్,పాల్గొన్నారు.
ఎల్బీనగర్, జూలై 2 : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తుందన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆర్థికంగా ఆసరా లభిస్తుందన్నారు. 199 మందికి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ రామ్మోహన్ పాల్గొన్నారు.
మన్సూరాబాద్, జూలై 2: సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని చంద్రపురికాలనీకి చెందిన వేమారెడ్డి గుండె సంబంధిత వ్యాధితో ఎల్బీనగర్లోని కామినేని దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. ఖర్చును భరించలేని స్థితిలో ఉన్న కుటుంబసభ్యులు విషయాన్ని కాలనీ గౌరవ అధ్యక్షుడు రుద్ర యాదగిరి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి తెలియజేయగా ఆయన స్పందించి సీఎం ఆర్ఎఫ్ నుంచి రూ. 60 వేలను మంజూరు చేయించారు. చెక్కును శుక్రవారం బాధితుడు వేమారెడ్డికి ఎమ్మెల్యే అందజేశారు. మాజీ కార్పొరేటర్ విఠల్‌రెడ్డి, చంద్రపురికాలనీ గౌరవ అధ్యక్షుడు రుద్ర యాదగిరి, నాయకులు యాదగిరి, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.