ఎల్బీనగర్, ఏప్రిల్ 9 : ముఖ్యమైన ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. గడ్డిఅన్నారం ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్ నుంచి సాయిబాబా గుడి ఆర్చి వరకు సర్వీస్ రోడ్డును ఆయా విభాగాలు తవ్వి వదిలేశారని అన్నారు. సర్వీస్‌రోడ్డులో సీసీ వేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులతో క్షేత్ర స్థాయిలో సమావేశం నిర్వహించి యూజీడీ లైన్ ఒక ఫీట్ వరకు వెడల్పు చేసి ప్రతి 50 అడుగులకు మ్యాన్‌హోల్ వేయిస్తామని అన్నారు. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా కాంప్లెక్స్‌లోని ఒక షాపును పార్కింగ్‌కు కేటాయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ భవానిప్రవీణ్కుమార్, డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్య , సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లు, మలక్‌పేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఈ అశోక్‌రెడ్డి, ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు తులసి శ్రీనివాస్, సతీశ్‌కుమార్, రమేశ్, శంకర్, మహేంద్ర, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌బాబు, రాజేశ్, బాలరాజుగుప్తా, నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
వనస్థలిపురం, ఏప్రిల్ 9 : బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ గాయత్రినగర్ రోడ్డు సమస్యను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పరిష్కరించారు. కాలనీ ఉత్తరం వైపున రహదారి లేక కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను శుక్రవారం టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి సమస్యను విన్నవించారు. స్పందించిన ఆయన తాసీల్దార్, ఆర్డీవోలతో రోడ్డు విషయమై చర్చించారు. దీంతో అధికారులు మధ్యాహ్నం కాలనీలో పర్యటించి రోడ్డు స్థలా న్ని గుర్తించి వారికి కేటాయించారు. కొన్నేళ్లుగా ఉన్న తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
చంపాపేట, ఏప్రిల్ 9 : చిరు ధాన్యాలతో చేసిన వంటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మొదటి ముద్ద సాంప్రదాయ శాకాహార, ఫలహారాల శాఖను మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. నిర్వాహకులు భావన శ్రీనివాస్, రంగనాథ్ పాల్గొన్నారు.