హిమాయత్‌నగర్,ఆగస్టు 25 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి కుటుంబాల ఆడబిడ్డల పెండ్లిలకు కొండంత అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బుధవారం ఆదర్శ్‌నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో హిమాయత్‌నగర్ డివిజన్‌కు చెందిన 28 మంది లబ్ధి దారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కార్పొరేటర్ జి.మహాలక్ష్మి, మాజీ కార్పొరేటర్ జె. హేమలత యాదవ్‌లతో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడ బిడ్డల పెండ్లిలు తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశ పెట్టారని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బాబుయాదవ్,యాదగిరి, ప్రభాకర్‌గౌడ్, నందు, సర్ఫరాజ్, కృష్ణయాదవ్, బీజేపీ నాయకులు రామన్‌గౌడ్, నర్సింగ్‌గౌడ్,జైస్వాల్,జాకీ తదితరులు పాల్గొన్నారు.