ఖైరతాబాద్, ఆగస్టు 6 : సీఎం కేసీఆర్ పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక అభివృద్ధి పథకాలు తీసుకువచ్చారని, వారి కండ్లల్లో ఆనందం చూడడమే ఆయన లక్ష్యమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అ న్నారు. శుక్రవారం సోమాజిగూడలోని బీఎస్ మ క్తాలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన రేషన్‌కార్డులను కార్పొరేటర్ వనం సంగీత యాదవ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో, రాష్ర్టంలో అనేక ప్రభుత్వాలను చూశానని, సీఎం కేసీఆర్ మాత్రం పేదల కష్టాలను స్వయంగా తెలుసుకొని వారిని అభివృద్ధి చేసే పథకాలు తీసుకువస్తున్నారని, అలాంటి సీఎం ఉండడం అదృష్టమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎస్కె అహ్మద్, వనం శ్రీనివాస్ యాదవ్, సలావుద్దీన్, నాగరాజు, ఉత్తమ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
వెంగళరావునగర్, ఆగస్టు 6: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ డివిజన్..ఎల్లారెడ్డిగూడలో కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్తో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. నాయకులు తన్నుఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్ పాల్గొన్నారు.