మారేడ్‌పల్లి, అక్టోబర్ 26: బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. లాస్య నందిత అన్నారు. గురువారం కంటోన్మెంట్ ఐదో వార్డులో మహాత్మాగాంధీనగర్, సంజీవయ్యనగర్, వీకర్ సెక్షన్, సెకండ్ లక్ష్మీనగర్, ఇంద్రపురి రైల్వే కాలనీ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దాల నర్సింహ ఆధ్వర్య ంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి అభ్యర్థి జి. లాస్య నందిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు వివరిస్తూ…కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా అభ్యర్థి లాస్యనందితకు స్థానిక ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జి. లాస్యనందిత మాట్లాడుతూ.. .సమైక్య పాలనలో కంటోన్మెంట్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని…బీఆర్ఎస్ ప్రభుత్వంలో దివంగత ఎమ్మెల్యే జి. సాయన్న ఆధ్వర్యంలో కంటో న్మెంట్లో కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు .కంటోన్మెంట్లో జరిగిన అభివృద్ధిని చూసి ఈ సారి తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పాదయాత్ర సమయంలో స్థానిక ప్రజల నుంచి పలు సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించిన అనంతరం….ఎమ్మెల్యేగా ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నివేదిత, సీనియర్ నాయకులు పెద్దాల నర్సింహ యాదవ్, గిరి, రావు, రాజు రిచర్డ్ రాజు, బాలమ్మ,పద్మ, మాస్టర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.