మల్లాపూర్, నవంబర్ 3: ముస్లిం మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పిస్తున్నదని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్లోని జమా మసీదు వద్ద ముస్లిం సోదరులు, కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు జి.శ్రీనివాస్‌రెడ్డి, గొల్లూరి అంజయ్యతో కలిసి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు తమ మద్దతు తెలుపుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బద్రుద్దీన్, డివిజన్ మాజీ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్, ఎండీ. అలీమొద్దీన్, నిసార్ అహ్మద్ ఘోరీ, షకీల్ ఉజ్ జమా, ఎండీ. సలీముద్దీన్, మసూద్ భాయ్, ఖలీమ్, మజీబ్, బీఆర్ఎస్ నాయకులు మధు ముదిరాజ్, రహీం భాయ్, ఇక్బాల్, సాయి కుమార్, నవీన్ గౌడ్, జంపాల్రెడ్డి, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా లండన్‌లో ప్రచారం చేపట్టారు. ఈమేరకు లండన్‌లోని ఉప్పల్ నియోజకవర్గ ఓటర్లు బండారి లక్ష్మారెడ్డికి ఓటు వేయాలని కోరారు. నాచారానికి చెందిన సందీప్‌రెడ్డి శుక్రవారం లండన్ బ్రిడ్జి వద్ద ప్లకార్డులతో ప్రచారం చేపట్టారు. లక్ష్మారెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు.