MLA Gandhi | కొండాపూర్, ఫిబ్రవరి 18 : డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. మంగళవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఓయూ ప్రొఫెసర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ హామీ పటేల్, జలమండలి అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ఎంతో కాలంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలోకి తీసుకొని రూ. 75 లక్షల అంచనా వ్యయం తో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్నివేళలా ముందుంటానని, ఎక్కడ ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం శరత్, మేనేజర్ సందీప్, స్థానికులు పాల్గొన్నారు.